ఇక నుంచి ప్రాంతీయ భాషల్లోనూ బ్యాంక్ పరీక్షలు!

Update: 2019-07-04 09:47 GMT

బీఎస్సాఆర్బీ నిర్వహించే బ్యాంక్ పరీక్షలు ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే రాయల్స్ వస్తోంది ఇన్నాళ్లూ. దీంతో ప్రాంతీయ భాషల్లో చదువుకున్న విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ప్రాంతీయ భాషలో చదువుకుని, బ్యాంక్ పరీక్ష కోసం ఇంగ్లిష్ భాషలో సిద్ధం కావడం కష్టతరమే.. ఉద్యోగాల సాధనలో వెనుకబడిపోతున్నారు. ఇపుడు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని మారుస్తోంది. 

ఇకపై బ్యాంకు ఉద్యోగాల పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో ప్రకటించారు. బీఎస్సాఆర్బీ ఇకపై 13 ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలు నిర్వహించనుంది.

దీనివలన ఎందరో విద్యార్థులకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు మీడియం లో చదువుకుంటున్న తెలుగు ప్రజలకు ఈ విధానం వలన ప్రయోజనం చేకూరుతుంది. 


Tags:    

Similar News