ట్రాఫిక్ పోలీస్ నిర్వాకం..గుండెపోటుతో ఇంజనీర్ మృతి!

తన కారుని పోలీసులు లాఠీలతో కొడుతుంటే సహించలేని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వారితో గొడవ పడ్డాడు. దీంతో గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఈ సంఘటన నోయిడాలో చోటుచేసుకుంది.

Update: 2019-09-10 05:52 GMT

ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహ నిర్వాకం ఒకరి ప్రాణాలు తీసింది. తన కారుపై లాఠీలతో కొట్టడం తో తట్టుకోలేని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ట్రాఫిక్ పోలీసులతో గొడవపడ్డాడు. ఆ ఉద్వేగంలో గుండెపోటు తో మరణించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ విషాదకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఆదివారం చోటు చేసుకుంది.

నోయిడకు చెందిన 34 ఏళ్ల వ్యక్తీ తన తల్లిదండ్రులతో కారులో వెళుతున్నారు. ఘజియాబాద్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు అయన కారును ఆపారు. కొత్త చట్టం ప్రకారం తనిఖీలు చేయాలంటూ లాఠీలతో కారుపై కొట్టారు. అలా ఎందుకు కోడతారంటూ ఆ టెకీ పోలీసులను వారించాడు. ఈ నేపధ్యంలో పోలీసులకు, ఆ వ్యక్తికీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తీ మృతి చెందాడు.

ఈ ఘటనపై ఆ వ్యక్తీ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసుల వల్లే తమ కుమారుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి నిబంధనలూ తాము ఉల్లంఘించలేదనీ.. అయినా సరే పోలీసులు తమ కారుపై లాఠీలతో కొట్టి అభ్యంతరకరంగా ప్రవర్తించారని మృతుని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనపై నోయిడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News