దళిత యువకుడిని ప్రేమించిందని కూతురికి నిప్పంటించిన తల్లి

Update: 2019-11-20 08:23 GMT

దళిత యువకుడిని ప్రేమించినందుకు తల్లి కూతురికి నిప్పంటించి, తాను కూడా ఆత్మహత్యా యత్నం చేసుకున్న సంఘటన తమిళనాడులో సంచలాన్ని సృష్టిస్తుంది.

ఈ సంఘటన పూర్తి వివరాల్లోకెళితే తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఉమా మహేశ్వరి రోజువారీ కూలీగా పనిచేస్తుంది. ఆమె భర్త కన్నన్ తిరుమారుగల్ అదే గ్రామంలో వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి జనని అనే 17 ఏళ్ల కూతురు ఉంది.

బీసీ వర్గానికి చెందిన జనని అదే గ్రామానికి చెందిన ఒక దళిత యువకుడితో ప్రేమలో పడింది. వచ్చే నెలలో తాను మేజర్ అయిన తర్వాత వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం గురించి తెలిసిన జనని తల్లిదండ్రులు ఆమెను మందలించారు. ఇదే సమయంలో తల్లికి, కుమార్తెకి మధ‌్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఉమ తన సహనాన్ని కోల్పోయింది. వెంటనే తన కూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. అనంతరం ఆమెకూడా నిప్పంటించుకుంది. వారిద్దరి అరుపులూ విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి గాయపడిన ఇద్దరినీ నాగపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలు తీవ్రం కావడంతో జనని దారిలోనే మరణించింది. 90 శాతం కాలిన గాయాలతో ఉమ పరిస్థితి విషమంగా ఉంది.

ఈ సంఘటనపై పోలీసులు ఉమపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తను ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..



Tags:    

Similar News