ప్రధాని కూడా ఆ రోజే!

Update: 2019-05-26 12:31 GMT

ప్రధానిగా రెండోసారి ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖారారైంది. రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రధాని ప్రమాణ స్వీకార విషయాన్ని వెల్లడించింది. ఈ నెల 30 వ తేదీన రాత్రి 7 గంటలకు మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానితో పాటు కొంతమంది కీలక మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా అదే రోజు మధ్యాహ్నం తన ప్రమాణ స్వీకారాన్ని చేయనున్న విషయం తెలిసిందే!

Similar News