తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం అన్నిరోజులు ఆగాలా..?

Update: 2019-03-10 13:01 GMT

సార్వత్రిక సమరం మొదలయింది. ఏప్రిల్ 11 న తొలిదశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆంధ్ర తెలంగాణకు మొదటి దశలో అంటే ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రా , తెలంగాణాకు ఈనెల(మార్చి) 18న నోటిఫికేషన్ రానుంది.18 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లకు చివరి తేదీ ఈనెల(మార్చి) 25. ఈనెల(మార్చి)26 న నామినేషన్ల పరిశీలన.

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈనెల 28. పోలింగ్ డేట్ : ఏప్రిల్ 11న. మే 23 న ఎన్నికల ఫలితాలు ఉంటాయి. అంటే ఫలితాల కోసం సరిగ్గా 42 రోజులు ఎదురుచూడాలి.. ఇంత సమయం ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి రెండు సార్లు మాత్రమే వచ్చింది. ప్రతిసారి ఎన్నికల పోలింగ్ మరియు ఫలితాలకు10 లేదా రెండు రోజులు అటోఇటో వెండిది. ఈసారి ఏకంగా 42 రోజులు ఫలితాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. దీంతో ఈవీఎంలకు అని రోజులపాటు గట్టి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.  

Similar News