కార్యకర్త పుట్టినరోజుకు ముఖ్యమంత్రి అతిథి!

Update: 2019-05-31 14:05 GMT

రాజకీయ పార్టీ లో కార్యకర్తలంటే జెండా మోసే వాళ్ళు మాత్రమే అనే చప్పుకుంటారు. సాధారణంగా పార్టీలో ఎన్నికల సమయంలో తప్పితే వారికి ఏ విధమైన గుర్తింపు ఉండదు. కార్యకర్త థన్ సొంత ప్రాంతంలోని చిన్న పాటి నాయకుడి దగ్గరకు వెళ్లినా చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. అయినా పార్టీ నాయకుడి కోసం.. పార్టీ సిదంతం కోసం తానూ నమ్మిన పార్టీ జెండాను మోసి సరదా పడతాడు కార్యకర్త. ఇదంతా ఎందుకంటే, ఇటువంటి కార్య కర్త పుట్టినరోజు అంటే గల్లీ నాయకుడు కూడా వెళ్ళడు. అటువంటిది ఓ సామాన్య కార్యకర్త పుట్టినరోజుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అతని ఇంటికి వెళ్లి వేడుక జరిపిస్తే ఎలా ఉంటుంది. 

సరిగ్గా ఆ పనే చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ సోషల్ మీడియా టీం మెంబర్ వివేక్ పుట్టిన రోజు సందర్భంగా దగ్గరుండి అతనితో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలను వివేక్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

'ఓ సాధరణ కార్యకర్తకు ఓ ముఖ్యమంత్రి నుంచి లభించిన అరుదైన గౌరవం' అంటూ వివేక్ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్, ఫోటోలు వైరల్ అవడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. దీనిపై స్పందించిన కేజ్రీ, పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసే కార్యకర్తలే తమకున్న గొప్ప బలమని, కార్యకర్తల సాయంతోనే తమ పార్టీ దేశ సేవ చేస్తోందని వ్యాఖ్యానించారు.

Similar News