మలుపులు తిరుగుతున్న కన్నడ రాజకీయం

Update: 2019-07-22 03:13 GMT

కర్నాటక రాజకీయాలు ఇంకా మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. విశ్వాస తీర్మానం పై చర్చ మొన్న శనివారం అర్థాంతరంగా ఆపుచేసి సోమవారానికి సభను వాయిదా వేశారు స్పీకర్. ఆదివారం ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. విశ్వాస పరీక్ష ఆలస్యమయ్యేలా కాంగ్రెస్, జేడీఎస్ ఎత్తులు మొదలు పెట్టాయి. ఈలోపు ఆదివారం రాత్రి అనారోగ్యంతో సీఎం కుమారస్వామి ఆసుపత్రిలో చేరారు. ఇక మరోవైపు తక్షణమే విశ్వాస పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కుమారస్వామి తీరుపై బీజేపీ నేతల విమర్శలు చేశారు. విశ్వాస తీర్మానాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న యడ్యూరప్ప. 

Tags:    

Similar News