Indigo Flight: ఇండిగో విమానంలో చెలరేగిన మంటలు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్
Indigo Flight: టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలను గుర్తించిన సిబ్బంది
Indigo Flight: ఇండిగో విమానంలో చెలరేగిన మంటలు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్
Indigo Flight: దేశ రాజధాని ఢిల్లీలో ఇండిగో విమానానికి పెను ప్రమాద తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న 6E 2131 విమానంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వెంటనే ప్రయాణీకులను, సిబ్బందిని విమానం నుంచి కిందకు దింపేశారు. విమానంలోని వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది DGCA.