కరోనా నుంచి కోలుకున్న వారిపై వివక్ష వద్దు : కేంద్రం

కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తులపై కొంత మంది వివక్ష చూపి వారిని దూరంగా ఉంచుతున్నారు.

Update: 2020-04-28 05:37 GMT
Representational Image

కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తులపై కొంత మంది వివక్ష చూపి వారిని దూరంగా ఉంచుతున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి కీలక ప్రకటన చేసింది. ఎవరూ కూడా కరోనానుంచి కోలుకున్న వారిని ఎవరూ కూడా దూరంగా ఉంచకూడదని, వారిపై వివక్ష చూపించకూడదని సూచించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను స్వీకరించి దాన్ని ద్వారా మరికొంత మంది కరోనా బాధితులకు 'ప్లాస్మా థెరపీ' చేయడం ద్వారా వారిని కాపాడవచ్చని తెలిపింది. కరోనా వచ్చి ఒక్కసారి కోలుకున్న తరువాత వారినుంచి ఇతరులకు వైరస్ సోకదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం మన దేశంలో 27,892 కేసులు నమోదయ్యాయని, వారిలో ఇప్పటి వరకు 872 మంది మరణించారన్నారు. వారిలో ఇప్పటిదాకా 6184 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల్లో కోలుకున్న వారి శాతం 22.17గా ఉందని తెలిపారు. గడచిన 24గంటల్లో దేశంలో 1396 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. అంతే కాక గతంలో 16 జిల్లాల్లో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయని, గడచిన 28 రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్రం వెల్లడించింది. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరిస్తే దేశంలో కరోనా కేసుల సంఖ్యను తగ్గించవచ్చిన తెలిపారు.


Tags:    

Similar News