ఆర్టికల్ 370 రద్దుపై చైనా వ్యతిరేక వ్యాఖ్యలు!

Update: 2019-08-06 14:22 GMT

ఊరందరిదీ ఒక దారి.. ఉలుపు కట్టెది ఒకదారి! అన్నట్టు ఉంది చైనా పాకిస్తాన్ వ్యవహారం. కాశ్మీర్ లో 370 అధికరణం రద్దు వ్యవహారం భారత అంతర్గత వ్యవహారం అని ప్రపంచ దేశాలన్నీ అంటున్నాయి. కానీ, మొదట్నుంచీ భారతదేశంపై అక్కసు వెళ్ళగక్కడమే పనిగా పెట్టుకున్న చైనా మాత్రం దీనిని భూతద్దంలో చూపిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానికి పాకిస్తాన్ వత్తాసు పలుకుతోంది.

ఈరోజు చైనా విదేశాంగశాఖ కార్యదర్శి కశ్మీర్‌ విషయంలో భారత్‌ తీరు తమ సార్వభౌమత్వాన్ని బలహీనపరిచేలా ఉందంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుపై స్పందిస్తూ అయన ఈ ప్రకటన చేశారు. దానికి పాకిస్తాన్ తందానా అంటూ వంత పాడుతోంది. ఇక ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న చైనా.. తాజాగా భారత్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.



Tags:    

Similar News