పిటిషన్ వేసేది ఇలానేనా? అసహనం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్

ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ వేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అసలు పిటిషనర్ ఏం కోరుకుంటున్నారో అర్థ గంట పాటు పిటిషన్ చదివినా అర్థం కాలేదని అయన చెప్పారు.

Update: 2019-08-16 07:17 GMT

ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ వేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అసలు పిటిషనర్ ఏం కోరుకుంటున్నారో అర్థ గంట పాటు పిటిషన్ చదివినా అర్థం కాలేదని అయన చెప్పారు. లోపాల మయంగా పిటిషన్ దాఖలు చేశారని అసలు మీరు ఎలాంటి పిటిషన్ దాఖలు చేశారంటూ శర్మను ప్రశ్నించారు. ఇపుడు మీ పిటిషన్ తిరస్కరిస్తే.. దీనికి సంబంధించి దాఖలైన ఇతర ఐదు వ్యజ్యాలపైనా ప్రభావం పడుతుందన్నారు. దీనికి స్పందించిన న్యాయవాది శర్మ పిటిషన్ లో సవరణలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

ఇక కశ్మీర్‌లో మీడియా, కమ్యూనికేషన్‌ వ్యవస్థపై విధించిన ఆంక్షలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ద కశ్మీర్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ అనురాధా బేసిన్‌ వేసిన పిటిషన్‌పైనా ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే స్పందిస్తూ.. ల్యాండ్‌లైన్‌ వ్యవస్థ పనిచేస్తోందని, ఈరోజు ఉదయం కశ్మీర్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో మాట్లాడినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. కశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయని తెలిపారు. జిల్లాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. దశలవారీగా ఆంక్షలు తొలగిస్తామని కోర్టుకి వివరించారు. దీంతో కేంద్రానికి మరికొంత సమయం ఇద్దామన్న ధర్మాసనం.. దీనిపై మరోసారి విచారిద్దామంటూ వాయిదా వేసింది.


Tags:    

Similar News