చందమామను అందుకునేందుకు వడి వడిగా..

ఇస్రో ప్రతిష్టాత్మక కార్యక్రమం చంద్రయాన్ 2 దిగ్విజయంగా సాగుతోంది. ఈరోజు కక్ష్య పెంపు కార్యక్రం విజయవంతమైనట్టు ఇస్రో ప్రకటించింది. ఇక, ఈ యాత్రలో నాలు కీలక ప్రక్రియలు మిగిలి వున్నాయి. వాటిని దాటుకుని సెప్టెంబర్ 7న చంద్రుని ఉపరితలం పై దిగనుంది.

Update: 2019-08-14 16:38 GMT

ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్ ఈరోజు మరో మైలురాయిని అధిగమించింది. భూకక్ష్యను వీడి జాబిల్లి కక్ష్యలోకి విజయవంతంగా వెళ్ళింది. కక్ష్యను పంచే ప్రయోగాన్ని ఇస్తో శాస్త్రవేత్తలు ఈ తెల్లవారుజామున విజయవంతంగా నిర్వహించారు. వ్యోమనౌక లోని ద్రవ ఇంధనాన్ని 1203 సెకన్ల పాటు మండించి కక్ష్యను పెంచినట్టు ప్రకటించారు. ప్రస్తుతం చంద్రయాన్ ల్యూనార్ మార్గంలో ప్రయాణిస్తోంది. ఇప్పటి వరకూ షెడ్యూల్ ప్రకారం కక్ష్యలు పెంచే ప్రక్రియలు విజయవంతంగా పూర్తీ చేశామని తెలిపారు.

కాగా, ఈ నెల 20న చంద్రయాన్‌-2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. దాని కోసం మరోసారి ద్రవ ఇంజిన్‌ను మండించాల్సి ఉంటుందని తెలిపారు. దీని తరువాత నాలుగు కీలక ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుందనీ, సెప్టెంబర్ 7న చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-2 దిగుతుందని ఇస్రో తెలిపింది.


Tags:    

Similar News