బ్రిడ్జ్ కూలిన ఘటనలో 40మంది మృతి

Update: 2019-01-27 01:43 GMT

బ్రెజిల్ లోని పరావోపెబా నదిపై ఉన్న డ్యాం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 40 చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దుర్ఘటనలో సుమారు 300 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. డ్యాం కూలడంతో సమీపంలోని ప్రాంతాల్లో బురద ముంచెత్తింది. ఇళ్లన్నీ బురదతో నిండిపోవడంతో బాధితులను హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డ్యాం కూలిపోవడంతో 'వలే' కంపెనీపై బ్రెజిల్‌ పర్యావరణశాఖ శనివారం సుమారు రూ.462 కోట్ల భారీ జరిమానా విధించింది. కొన్ని నెలల క్రితమే జర్మనీకి చెందిన టుయెవ్‌ స్యూడ్‌ కంపెనీ ఈ ఆనకట్టను తనిఖీ చేసి ఎలాంటి లోపాలు లేవని ధ్రువీకరించింది. కాగా ఆనకట్ట పూర్తిగా కూలడంతో భారీ స్థాయిలో బురద వరదలా పొంగి సమీపంలో ఉన్న ప్రాంతాన్ని ముంచెత్తింది..మధ్నాహ్న భోజనం చేస్తున్న కార్మికులందరూ బురద కింద సజీవ సమాధి అయ్యారు.

Similar News