ఆదివారం కూడా బ్యాంకులు పనిచేస్తాయి..

Update: 2019-03-29 13:08 GMT

ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆదివారం కూడా బ్యాంకులు తెరిచే ఉడేటట్టు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీచేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2018-19 ఆర్థిక సంవత్సరానికి చెందిన అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలో లెక్కగట్టాలని ఆర్‌బీఐ దేశంలోని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.. ఇందుకోసం ఈ ఆదివారంను కూడా వర్కింగ్ డే గా వాడుకోవాలని సూచించింది.

దీంతో మార్చి 31 సాయింత్రం 6గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. లావాదేవీల విషయంలో కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని.. అలాగే ఆర్‌టీజీఎస్, నెప్ట్, ఇతర ఎలక్ట్రానిక్ లావాదేవీల సమయాన్ని కూడా పొడిగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.  

Similar News