Bad News for Alcohol Lovers: 2026లో 28 రోజుల పాటు 'డ్రై డేస్'.. వైన్ షాపులు బంద్ అయ్యే కంప్లీట్ లిస్ట్ ఇదే!
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్! 2026లో మొత్తం 28 రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. జనవరి 26 నుంచి డిసెంబర్ 25 వరకు డ్రై డేస్ పూర్తి జాబితా ఇక్కడ చూడండి.
మద్యం ప్రియులు తమ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. 2026 సంవత్సరానికి సంబంధించి దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా పలు రాష్ట్రాల్లో డ్రై డేస్ (Dry Days) జాబితాను ఎక్సైజ్ శాఖలు విడుదల చేశాయి. శాంతిభద్రతలు, జాతీయ సెలవులు మరియు పండుగల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
డ్రై డే అంటే ఏమిటి?
డ్రై డే రోజున రిటైల్ వైన్ షాపులు, బార్‌లు, పబ్‌లు మరియు హోటళ్లలో మద్యం విక్రయాలు పూర్తిగా నిషిద్ధం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
2026 డ్రై డేస్ ప్రధాన జాబితా:
ముఖ్య గమనికలు:
ప్రాంతీయ మార్పులు: జాతీయ సెలవులు అందరికీ వర్తిస్తాయి. కానీ శివాజీ జయంతి (మహారాష్ట్ర), గణేష్ చతుర్థి (కర్ణాటక, మహారాష్ట్ర) వంటివి ఆయా రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతాయి.
ఎన్నికల సమయంలో: ఒకవేళ మీ ప్రాంతంలో స్థానిక ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు జరిగితే, అదనంగా మరో 2-3 రోజులు డ్రై డేస్ ఉండవచ్చు.
అకస్మాత్తుగా షాపులు బంద్ అయి ఇబ్బంది పడకుండా ఉండాలంటే, ఈ లిస్ట్‌ను ముందే చూసుకుని మీ ప్లాన్‌లను సర్దుబాటు చేసుకోండి.