శశిథరూర్ కు అరెస్టు వారెంట్

కాంగ్రెస్‌ సీనియర్ నేత శశిథరూర్‌ రాసిన 'ది గ్రేట్‌ ఇండియన్‌ నావెల్‌' అనే పుస్తకం ఆయనను చిక్కుల్లో పడేసింది.

Update: 2019-12-22 08:48 GMT
శశిథరూర్‌

కాంగ్రెస్‌ సీనియర్ నేత శశిథరూర్‌ రాసిన 'ది గ్రేట్‌ ఇండియన్‌ నావెల్‌' అనే పుస్తకం ఆయనను చిక్కుల్లో పడేసింది. దాదాపుగా ఆయన ఆ పుస్తకాన్ని 30 ఏళ్ళ క్రితం రాసారు. 1989 లో రాసిన ఈ పుస్తకంలో హిందూ మహిళలను అవమానపరిచాడని, ఒక వర్గాన్ని కించపరుస్తూ, వారి ప్రతిష్టను దిగజార్చేలా పుస్తకాన్ని రాసారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో శనివారం తొలి విచారణ జరగనుండగాల్సి ఉండగా థరూర్ ఈ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో తిరువనంతపురంలోని ఓ స్థానిక కోర్టు ఆయనని అరెస్ట్ చేయాలని వారెంట్‌ జారీ చేసింది.

ఈ విషయంపై స్పందించిన శశిథరూర్‌ కార్యాలయ ప్రతినధులు కోర్టు జారీ చేసిన సమన్లలో శశిథరూర్ హాజరు కావాలని ఉంది తప్ప అందులో తేదీ లేదని తెలిపారు. ఇప్పటి వరకూ అధికారికంగా తమకు విచారణ గురించి ఎలాంటి సమాచారం రాలేదని వారు తెలిపారు. థరూర్ కు వారెంట్ జారీ అయిన విషయం కూడా తమకు మీడియా ప్రకటనల ద్వారానే తెలిసిందని తెలిపారు. ఏది ఏమైనా అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ.. తాము తిరువనంతపురం చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో అప్పీలు దాఖలు చేస్తామని వివరించారు.  

Tags:    

Similar News