భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 700 దుకాణాలు దగ్ధం
Arunachal Pradesh: ఇటానగర్‌లో కాలిపోయిన దుకాణాలు, బాణసంచా పేలుడే ప్రమాదానికి కారణం.
అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇటానగర్‌లోని నహర్లగున్ డెయిలీ మార్కెట్లోని సుమారు 700లకుపైగా దుకాణాలు కాలి బూడిదయ్యాయి. అగ్నిప్రమాదానికి బాణసంచా పేలుడే కారణమంటున్నారు స్థానికులు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది ఆలస్యంగా రావడంతో అప్పటికే పక్కదుకాణాలకు మంటలు వ్యాపించాయి. దుకాణాలు కాలిపోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. భారీ నష్టం ఏర్పడిందని ప్రభుత్వం ఆదుకోవాలని దుకాణాల యజమానులు వేడుకుంటున్నారు.