శ్రీనగర్‌లో రాహుల్‌ గాంధీ టీమ్‌కు చుక్కెదురు

జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వెళ్లిన రాహుల్ బృందానికి చుక్కెదురయింది. రాహుల్‌తో పాటు మరో 11 మంది నాయకులను శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అడ్డుకున్నారు.

Update: 2019-08-24 11:02 GMT

జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వెళ్లిన రాహుల్ బృందానికి చుక్కెదురయింది. రాహుల్‌తో పాటు మరో 11 మంది నాయకులను శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి పంపివేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా నేతలు పర్యటించడం సరికాదని భావించిన పోలీసులు నేతలందరినీ పంపించివేశారు.శ్రీనగర్‌ వెళ్లిన వారిలో రాహుల్‌ గాంధీతో పాటు గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ ఉన్నారు. వారితో పాటు సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే పార్టీల సీనియర్ నేతలు శ్రీనగర్‌ పర్యటన చేపట్టేందుకు సమాయత్తం అయ్యారు. పోలీసులు అడ్డుకోవడంతో వీరి పర్యటనకు బ్రేక్ పడింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఏ రాజకీయ పార్టీ నేతను కూడా జమ్ము కశ్మీర్‌లో పర్యటించడానికి అనుమతించలేదు. 

Tags:    

Similar News