నాలుగో పెళ్లికి సిద్దమైన భర్త.. మొదటి భార్య ఏం చేసిదంటే..

Update: 2019-07-06 10:53 GMT

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగో పెళ్లి చేసుకునేందుకు తయారైనా ముంతాజ్ అనే ఓ వ్యక్తిని అతని మొదటి భార్య కోర్టు వద్దేనే అందరి ముందు కొట్టిన ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. తన భర్త ఇంకో యువతితో కలిసి కోర్టులో అవుపించాడు దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది తన మొదటి భార్య. అయితే తన భర్త ఇంకో యువతిని పెళ్లి చేసుకునేందుకు కోర్టు వద్దకు వచ్చినట్టు సమాచారం. ముంతాజ్‌ను చూడగానే అతని వద్దకు వెళ్లిన మొదటి భార్య అతన్ని చెంప చల్లమనిపిస్తూ చితకబాదింది.

అయితే ఈ విషయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు కూడా ముంతాజ్‌ను చితకబాదారు. ముంతాజ్‌ను వారి నుండి పోలీసులు తప్పించడం ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. అయితే ముంతాజ్ తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతితో నాలుగో పెళ్లికి సిద్దమయ్యాడు. కాగా ముంతాజ్‌కు ఇప్పటికే పెళ్లయిన విషయం ఆ యువతికి తెలుసా లేదా అన్నది తెలియరాలేదు. ముంతాజ్ మొదటి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Similar News