మౌలాలీ హౌసింగ్ బోర్డు శ్మశానవాటికలో వేణుమాధవ్ అంత్యక్రియలు

Update: 2019-09-26 14:21 GMT

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. హైదరాబాద్‌ నగరంలోని మౌలాలీ హౌసింగ్ బోర్డు శ్మశానవాటికలో కుటుంబసభ్యులు వేణుమాధవ్ దహన సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో వేణుమాధవ్ భౌతికకాయాన్ని మౌలాలిలోని నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఫిల్మ్‌ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వేణుమాధవ్‌కు నివాళులర్పించారు. 

Tags:    

Similar News