చరణ్ ని 'రా' అనేసిన తమన్నా

Update: 2019-10-03 15:32 GMT

సినిమా హీరోల మధ్య మరియు హీరో, హీరోయిన్స్ మధ్య స్నేహం ఉండడం అనేది కామన్.. కానీ ఎక్కడ కూడా రా అని సంభోదించరు. అఫ్ కెమరాలో ఎలా ఉన్నప్పటికీ వన్స్ కెమరా ముందు ఉంటే మాత్రం మర్యాదగా పిలుస్తారు. కానీ ఒక్కోసారి యాక్సిడెంటల్ గా ఏరా అని అనేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ తమన్నా చేసింది కూడా అదే...

సైరా మంచి సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ హైదరాబాదులో థాంక్యు మీట్ ఏర్పాటు చేసారు. దీనికి చిరంజీవి, రామ్ చరణ్, జగపతి బాబు, పరిచురి బ్రదర్స్, దిల్ రాజు సురేందర్ రెడ్డి, తమన్నా పాల్గొన్నారు. ఇక ఇందులో తమన్నా మాట్లాడుతూ సినిమాలో లక్ష్మి అనే పాత్రకి మంచి పేరు వస్తుందని,ముఖ్యంగా చిరంజీవి గారి నుండి ప్రశంసలు అందుకోవడం హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక చిత్ర నిర్మాత రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ 'చరణ్ నువ్వు కో యాక్టర్ గా బెటరా , ప్రొడ్యూసర్ గా బెటరా, ఏం చెప్పాలి రా' అనేసింది. ఇక ఇదే వేడుకలో చరణ్ మాట్లాడుతూ తమన్నా గురించి మాట్లాడబోయి మా నయనతార అని అనేసినపుడు, తమన్నా గలగలా నవ్వేసింది. దీనితో చరణ్, నువ్వు నవ్వడం ఆపేస్తే, మాట్లాడతా అంటూ నవ్వుతూ అన్నాడు. 

Full View

Tags:    

Similar News