అక్కినేని వారసత్వం పుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు నాగచైతన్య..కూల్ గా సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. రేపు ( నవంబర్ 23) న పుట్టినరోజు జరుపుకుంటున్నాడు నాగ చైతన్య.. ఈ సందర్భంగా ప్రస్తుతం అయన నటిస్తున్న రెండు సినిమాల నుండి లుక్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు మేకర్స్. .
ప్రస్తుతం నాగచైతన్య వెంకీమామ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతన్యతో పాటు వెంకటేష్ కూడా నటిస్తున్నాడు. అయితే ఇందులోని చైతూ పాత్రని పరిచయం చేస్తూ ఓ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ఇందులో చైతూ కెప్టెన్ కార్తీక్ పాత్రలో ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటు చైతూ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో చైతూ తెలంగాణా కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు. నవంబర్ 23న ఉదయం 10.30 నిమిషాలకు ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్ని పరిచయం చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. సో చైతూ పుట్టినరోజుకు ఫ్యాన్స్ కి డబల్ ధమాకా రాబోతుంది అన్నమాట..