నా పక్కన రష్మినే హీరోయిన్ గా అనుకున్నారు కానీ ...?

Update: 2019-11-11 15:29 GMT
sudheer and rashmi

జబర్దస్త్ కామెడీ షో వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా మంది హాస్యనటులు దొరికారనే చెప్పాలి. వారు ఇటు జబర్దస్త్ చేసుకుంటూనే అవకాశాలు వచ్చినప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకరు సుధీర్ ఒకరు... ప్రస్తుతం సుధీర్ రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అందులో ఒకటి త్రీ మంకిస్ .. ఇందులో సుధీర్ తో పాటు రామ్ ప్రసాద్ , గెటప్ శ్రీను కూడా నటిస్తున్నారు. ఇక మరొకటి సాఫ్ట్ వేర్ సుధీర్ ఇందులో సుధీర్ కి జోడిగా ధన్యా బాలకృష్ణ నటించింది..

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సుధీర్ సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అందులో భాగంగా ఈ చిత్రం కోసం సుధీర్ కి జోడిగా ముందుగా యాంకర్ రష్మినే అనుకున్నారట దర్శక నిర్మాతలు.. ఆమెతో సంప్రదింపులు కూడా చేసారట. కానీ అప్పటికే రష్మి వేరే సినిమాలో నటిస్తుండడంతో ధన్యా బాలకృష్ణను హీరోయిన్ గా తీసుకున్నారని సుధీర్ చెప్పుకొచ్చాడు.

పూర్తి హాస్య ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదల చేసిన చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ మొదటివారంలో ఈ సినిమా విడుదల కానుంది... 

Full View

Tags:    

Similar News