రాహుల్ ని వాడేస్తున్న కార్తికేయ..

బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ చీఫ్ గెస్ట్ గా వచ్చి పాటను విడుదల చేయనున్నారు. దీనిని కార్తికేయ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

Update: 2019-11-15 14:12 GMT
rahul sipligunj karthikeya

తెలుగు బిగ్ బాస్ 3కి రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచినా సంగతి తెలిసిందే.. దీనితో రాహుల్ కి ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. చాలా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉన్నాడు రాహుల్ . ప్రస్తుతం రాహుల్ కి ఉన్న క్రేజ్ ని వాడేసుకోవడానికి Rx 100 హీరో కార్తికేయ కూడా సిద్దం అయిపోయాడు. కార్తికేయ నేహా సోలంకి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న 90 ML సినిమాలోని 'సింగిలు సింగిలు' అంటూ సాగే పాటను రేపు (శనివారం) సాయంత్రం విడుదల చేస్తున్నారు.

అయితే ఈ సాంగ్ రిలీజ్ హైదరాబాద్‌లోని ఫోరం సుజనా మాల్‌లో జరగనుంది. దీనికి బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ చీఫ్ గెస్ట్ గా వచ్చి పాటను విడుదల చేయనున్నారు. దీనిని కార్తికేయ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. రాహుల్ సిప్లిగంజ్ ఇమేజ్‌ను కార్తికేయ ఈ రకంగా వాడేసుకుంటున్నాడు అన్నమాట.. ఇక Rx 100 సినిమాతో మంచి హిట్టు కొట్టిన కార్తికేయ మళ్ళీ ఓ విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 90 ML డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది. 


keywords : rahul sipligunj,kartikeya,90ml movie,song,bigg boss 3 telugu winner

Tags:    

Similar News