వివి వినాయక్ 'సీనయ్య'లో విలన్ ఎవరంటే ?

Update: 2019-11-03 08:55 GMT
seenayya vv vinayak

మాస్ దర్శకుడు వివి వినాయక్ హీరోగా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన హీరోగా సీనయ్య అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని దిల్ రాజ్ నిర్మిస్తుండగా, నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు... ఈ మధ్యే సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇందులో ఓ సాధారణమైన మెకానిక్ గా కనిపించనున్నాడు వినాయక్.. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేసారు.

అయితే ఇందులో వినాయక్ కి విలన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా హీరో నవీన్ చంద్ర నటిస్తున్నట్టు సమాచారం.. ఈ మధ్య నవీన్ చంద్ర పోషించిన పాత్రలు అన్ని నెగిటివ్ రోల్స్ కావడం, అందులో నవీన్ చంద్ర అంచనాలకి మించి రాణించడంతో దర్శక నిర్మాతలు నవీన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.  

Tags:    

Similar News