నాని 'వి' సినిమాకి కరోనా ఎఫెక్ట్ !

వైవిధ్యమైన కథలు చేయడంలో ఇంద్రగంటి మోహన కృష్ణ సిద్దహస్తుడు. ప్రస్తుతం అయన దర్శకత్వంలో 'వి' అనే చిత్రం తెరకెక్కుతుంది.

Update: 2020-03-14 04:24 GMT
V movie postponed

వైవిధ్యమైన కథలు చేయడంలో ఇంద్రగంటి మోహన కృష్ణ సిద్దహస్తుడు. ప్రస్తుతం అయన దర్శకత్వంలో 'వి' అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాని, సుదీర్ బాబు హీరోలుగా నటిస్తుండగా, అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. హీరో నానికి ఇది 25వ చిత్రం కాగా, ఇంద్రగంటి దర్శకత్వంలో మూడో చిత్రం కావడం విశేషం..

ఇక ఈ చిత్రంలో నాని ఓ సైకో పాత్ర పోషిస్తుండగా, సుధీర్‌ బాబు పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం దేశమంతటా ఉన్నందున ఈ సినిమా విడుదల తేదిన మార్చే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉనట్టుగా తెలుస్తోంది. వైరస్‌ దెబ్బకు జనాలు థియేటర్‌ వరకు వచ్చి సినిమాని చూస్తారా అన్న అనుమానాల నేపధ్యంలో సినిమా విడుదల తేదిని మార్చాలని దిల్‌ రాజు భావిస్తునట్టుగా సమాచారం.

వైరస్ ప్రభావం తగ్గక సినిమాని రిలీజ్ చేయాలని అయన అలోచిస్తునట్టుగా తెలుస్తోంది. విడుదల తేదికి కొంత సమయమే ఉండడంతో సినిమా విడుదల తేదిని మార్చే అవకాశం ఉంది. సినిమా నుంచి రిలీజైన 'వస్తున్నా.. వచ్చేస్తున్నా..' ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటను అమిత్‌ త్రివేది, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి..



Tags:    

Similar News