సింపుల్ గా రంగమార్తాండ షూటింగ్ ప్రారంభం

సినిమా షూటింగ్ ని ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా స్టార్ట్ చేశాడు కృష్ణవంశీ.. విశాఖపట్నంలో చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.

Update: 2019-11-25 15:30 GMT
rangamarthanda

తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ లో కృష్ణవంశీ ఒకరు..చేసినవి కొన్ని సినిమాలు అయినప్పటికీ ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే సినిమాలని అందించారు కృష్ణవంశీ.. కానీ ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో చాలా గ్యాప్ తర్వాత అయన నటసామ్రాట్ అనే మరాఠీ సినిమాని రంగమార్తాండ పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు..

సినిమా షూటింగ్ ని ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా స్టార్ట్ చేశాడు కృష్ణవంశీ.. విశాఖపట్నంలో చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని కృష్ణవంశీ తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీనికి దర్శకుడు తేజ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి క్లాప్ కొట్టారు.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో యాక్ట్ చేయనున్నారు. రమ్యకృష్ణ ఓ ముఖ్యపాత్రలో మేరవనుంది. మరో ముఖ్యపాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నట్టు, ఈ పాత్ర గుండెల్ని పిండేలా ఉంటుందని చెప్పుకొచ్చాడు కృష్ణవంశీ.. ఈ సినిమాకి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  



Tags:    

Similar News