Jr NTR: నాకు ఇష్టమైన హీరో ‘రామారావు జూనియర్’.. జపాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

Jr NTR: "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

Update: 2023-07-28 12:57 GMT

Jr NTR: నాకు ఇష్టమైన హీరో ‘రామారావు జూనియర్’.. జపాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

Jr NTR: "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటనకి ఇండియన్ ఆడియన్స్ తో పాటు విదేశీ ప్రేక్షకులను కూడా ఫిదా అయ్యిపోయారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్.. పులితో ఇంట్రడక్షన్ సీన్ అండ్ ఇంటర్వెల్ లో యానిమల్ ఫైట్ సీన్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. సరిగ్గా చెప్పాలంటే ఎన్టీఆర్ ని ఒక సూపర్ హీరోలా ప్రాజెక్ట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ కి ఇంటర్నేషనల్ లెవెల్ భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా జపాన్ మంత్రి తారక్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న జపాన్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి యోషిమాసా హయాషి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఇండియా సినిమాలు.. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలు జపాన్ లో మంచి క్రేజ్ తెచుకుంటున్నాయి అని తెలిపారు. ఇటీవల విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)ను జపాన్‌ ప్రజలు ఎంతగానో అభిమానించారన్నారు. అనంతరం విలేకరులు.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మీకు ఏ హీరో నచ్చారు?’ అని ప్రశ్నించగా.. ‘‘రామారావు జూనియర్‌ నా అభిమాన హీరో’’ అని బదులిచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Tags:    

Similar News