దేవదాస్ కనకాల అంత్యక్రియలు పూర్తి ...

Update: 2019-08-03 10:20 GMT

ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మహాప్రస్థానంలో ఆయన తనయుడు రాజీవ్ కనకాల అంత్యక్రియలు పూర్తి చేసారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన శుక్రవారం మరణించారు. ఆయన మరణ వార్త తెలియగానే రాజకీయ మరియు సినీ ప్రముఖలు ఆయన ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పుకొచ్చారు. ఆయన సినిమాల్లో నటిస్తూ ఉంటూనే సినిమా పరిశ్రమలోకి వచ్చే వారికీ శిక్షణ ఇచ్చేవారు. రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, రఘువరన్, నాజర్ లాంటి ఎందరో మంది నటీనటులు అయన శిష్యులే. 

Tags:    

Similar News