వరుణ్ ధావన్ 55 లక్షల విరాళం

కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు 195 దేశాలకు పైగా వ్యాపించి 25 వేల మంది మరణాలకు కారణమైంది.

Update: 2020-03-29 07:47 GMT
Varun Dhawan (File Photo)

కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు 195 దేశాలకు పైగా వ్యాపించి 25 వేల మంది మరణాలకు కారణమైంది. అయిదు లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇక భారతదేశంలో ఇప్పటికే 25 మంది మృతి చెందగా, 979కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇక భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..

ఇక కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు.. ఇక బాలీవుడ్ నుంచి హీరో అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇక బాలీవుడ్ నుంచి మరో హీరో వరుణ్ ధావన్ 55 లక్షల రూపాయల డొనేషన్ ని ప్రకటించాడు. ఈ సందర్భంగా వరుణ్ తన ట్వీట్ లో... తాను పిఎం కేర్ ఫండ్‌కు రూ. 30 లక్షలు విరాళంగా ఇస్తున్నానని, ఈ పరిస్థితిని ఖచ్చితంగా అధిగమిస్తామన్నారు. ఈ దేశం మనదే అని పేర్కొన్నారు. అలాగే తాను 25 లక్షల రూపాయలను మహారాష్ట్ర సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చానని పేర్కొన్నారు. 



Tags:    

Similar News