బిగ్ బాస్ 13 కి సల్మాన్ ఖాన్ 200 కోట్ల రెమ్యునరేషన్?

అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ 13 సీజన్ కి గాను సల్మాన్ 200 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు బాలీవుడ్ లో ఓ వార్త హాల్ చల్ చేస్తుంది.

Update: 2019-12-01 17:11 GMT
Salman Khan

అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో లో బిగ్ బాస్ ఒకటి. ఇక బాలీవుడ్ లో ఈ షో కి మంచి క్రేజ్ ఉంది. ఈ షోకి సల్మాన్ కి స్పెషల్ అట్రాక్షన్.. బిగ్ బాస్ నాలుగోవ సీజన్ నుంచి ఈ షో కి సల్మాన్ హోస్ట్ గా వ్యవహరిస్తూన్నాడు. షో రేంజ్ పెరుగుతూ వస్తున్న కొద్ది సల్మాన్ పారితోషికం కూడా పెరుగుతూ వచ్చింది.

అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ 13 సీజన్ కి గాను సల్మాన్ 200 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు బాలీవుడ్ లో ఓ వార్త హాల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం సల్మాన్ వారానికి రూ.13 కోట్లు (ఎపిసోడ్‌కు రూ.6.5కోట్లు) పారితోషికం తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల ఆ షోను మరో ఐదు వారాలపాటు పొడిగించనున్నట్లు ప్రకటించారు.

దీంతో సల్మాన్ కి ఎపిసోడ్‌కు రూ.2 కోట్ల చొప్పున పారితోషకాన్ని పెంచారట. సల్మాన్ బిగ్‌బాస్ సీజన్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకు రూ.200 కోట్లను పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు..  

Tags:    

Similar News