రూలర్ రివ్యూ

ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం రూలర్‌.

Update: 2019-12-20 07:45 GMT

ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం రూలర్‌. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు (శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించారు. సీ కళ్యాణ్ సినిమాని నిర్మించగా, చిరంతన్‌ భట్ సంగీతమందించాడు. జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మన సమీక్షలో చూద్దాం..

కథ :

ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన మినిస్టర్ భవాని సింగ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన కూతురు కులాంతర వివాహానికి పోలీస్ ఆఫీసర్ ధర్మా (బాలకృష్ణ) సపోర్ట్ గా నిలుస్తాడు. దీనితో భవాని సింగ్ ఆఫీసర్ ధర్మాని ఎలా అయిన అంతమోదించాలని అనుకుంటాడు. కానీ ఆఫీసర్ ధర్మా కాస్తా అర్జున్ ప్రసాద్ గా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి సి.ఈ.వో గా కనిపిస్తాడు. కంపెనీ పనిమీద బ్యాంకాక్ వెళ్ళిన అర్జున్ ప్రసాద్ పై అటాక్ జరుగుతుంది. ఇంతకి ఆ అటాక్ చేసింది ఎవరు ? అసలు ఈ ధర్మ ఎవరు? ఎందుకు అర్జున్ ప్రసాద్ ను ధర్మ అంటున్నారు? అన్నది తెరపైన చూడాల్సిందే.

ఎలా ఉందంటే ?

బాలకృష్ణ సినిమా అంటేనే వన్ మ్యాన్ షో లాగా ఉంటుంది. ఇందులోను అదే కనిపిస్తుంది. రొటీన్ కథే అయినప్పటికీ స్క్రీన్ ప్లే లో కొత్తదనం చూపించలేకపోయాడు దర్శకుడు. బీసీ కాలం నాటి కథకి యుపీ బ్యాక్ గ్రాప్ ని యాడ్ చేసి బాలకృష్ణని ఓ కొత్త లుక్ లో ప్రెజెంట్ చేశాడు దర్శకడు. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ని ద్రుష్టిలో పెట్టుకొని కథ, కథనాలు రాసుకున్నట్టుగా కనిపిస్తుంది. సాధారణ ప్రేక్షకులకు ఇదంతా అసాధారణంగా కనిపిస్తుంది.

మొదటి భాగం పర్వాలేదు అనిపిస్తే రెండవ భాగం మొత్తానికే తేలిపోయింది. అన్నీ ఉహించిన సన్నివేశాలే ఉండడంతో ప్రేక్షకుడికి సినిమాతో కనెక్షన్ కట్ అవుతుంది. దర్శకుడిగా కెఎస్ రవికుమార్ బాలకృష్ణ ఇమేజి మాయలో పడిపోయినట్టుగా కనిపించింది. సినిమా మొత్తం మూస ఫార్మాట్ లోనే నడిపించాడు. కమర్షియల్ సినిమా తీస్తున్నాం కాబట్టి ఓ పాట ఆ తర్వాత ఓ ఫైటు అన్న తరహాలో సినిమా సాగింది. రెండవభాగంలో రైతుల గురించి బాలకృష్ణ చెప్పే సంబాషణలు, దానికి తాలూకు సన్నివేశాలు కొంత వరకూ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి సి.ఈ.వో గా బాలకృష్ణని యాంగ్ లుక్ లో చూపించడానికి పడ్డ శ్రమ మాత్రం సినిమాలో బాగా కనిపించింది.

ఎవరెలా చేశారంటే..

ఇక నటీనటుల విషయనికి వచ్చే సరికి సినిమా మొత్తం బాలయ్యే కనిపిస్తారు. రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. పంచ్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలలో బాలకృష్ణ తన మార్కుతో అదరగొట్టారనే చెప్పాలి. ఇక హీరోయిన్స్ విషయాని వచ్చేసరికి సోనాలి చౌహాన్ కేవలం గ్లామర్ కి మాత్రమే సరిపోగా, వేదికకి కొంచం యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. మిగతా నటీనటులు వారివారి పాత్రల మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

చిరంతన్ భట్ అందించిన సంగీతం ఫర్వాలేదని అనిపిస్తుంది. పరుచూరి మురళి అందించిన కథ, కథనాలు ఏమాత్రం కొత్తగా అనిపించవు. కెమెరావర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

చివరగా: బాలయ్య అభిమానులకు మాత్రమే సంక్రాంతి తీసుకువచ్చిన సినిమా "రూలర్"

గమనిక: ఈ విశ్లేషణ పూర్తిగా రచయిత వ్యక్తిగతమైనది. సినిమా పై, ఇతర విషయాలపై చర్చించిన అంశాలు ఆ రచయిత కోణంలో చెప్పినవి. సినిమాని చూసి మీకు మీరు సినిమా పై ఒక అభిప్రాయనికి రావాల్సి ఉంటుంది.

Also Read : రూలర్ : ట్విట్టర్‌ రివ్యూ

Tags:    

Similar News