Kitchen Hacks: రోటీ పిండి మిగిలిపోతే ఫ్రిజ్‌లో పెట్టేస్తున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?
చపాతీలు ఎక్కువ మంది భారతీయుల రోజువారీ ఆహారంలో భాగంగా మారిపోయాయి. బరువు తగ్గాలనుకునే వారు అయితే రోజు మూడు పూటలూ చపాతీలే తినే పరిస్థితి.
Kitchen Hacks: రోటీ పిండి మిగిలిపోతే ఫ్రిజ్‌లో పెట్టేస్తున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?
చపాతీలు ఎక్కువ మంది భారతీయుల రోజువారీ ఆహారంలో భాగంగా మారిపోయాయి. బరువు తగ్గాలనుకునే వారు అయితే రోజు మూడు పూటలూ చపాతీలే తినే పరిస్థితి. ఇలాంటి వారు ముందుగానే ఎక్కువ మొత్తంలో చపాతీ పిండిని కలుపుకుని, రోజుకో భాగం వాడుకునేందుకు ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిండి తడి ఉండటం వల్ల ఫ్రిజ్‌లో ఉంచినపుడే అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది తినడం వల్ల కడుపు నొప్పులు, వాంతులు, విరేచనాలు, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఫ్రిజ్‌లో ఉంచిన పిండి నుంచి పోషక విలువలు నశించి, విటమిన్లు తగ్గిపోతాయి. దీని ప్రభావం బరువు తగ్గే యత్నాల్లో కూడా చూపిస్తుంది.
వేడి చేయగానే అన్నం, సాంబార్, చట్నీలను తినటం ఎలా ఆరోగ్యానికి హానికరమో, అలాగే పాత చపాతీ పిండితో తయారైన రోటీలను తినడం కూడా మంచిది కాదు. వర్షాకాలంలో అయితే ఈ పరిస్థితి మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఈ కాలంలో లిస్టెరియా మోనోసైటోజీన్స్ అనే హానికరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు వంటి లక్షణాలను కలిగించగలదు.
ఇందువల్ల, ఎప్పుడైతే చపాతీలు చేయాలనుకుంటున్నారో, అప్పటికప్పుడు పిండి కలుపుకోవడం ఉత్తమం. అవసరానికి మించిన పిండి మిగిలితే ఫ్రిజ్‌లో ఉంచకుండా వాడేసేయాలి. అలాగే ఇతర ఆహార పదార్థాలను కూడా అదే రోజు వాడి పూర్తి చేయడం ఆరోగ్య పరంగా మంచిది. తాజా ఆహారమే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎప్పుడూ గుర్తుంచుకోండి.
మీరు కూడా ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నట్లయితే, ఇప్పుడే అప్రమత్తంగా ఉండండి!