జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు

Update: 2019-04-18 09:16 GMT

తెలంగాణలో మండల, జడ్పీటీసీ ఎన్నికల తేదిలు ఖరారయ్యాయి. మొత్తం 535 జడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. నేడో, రేపో అధికారికంగా నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఏప్రిల్ 22న మొదటివిడత నోటిఫికేషన్ విడుదల అవుతుంది. మే 6న ఎన్నికలు నిర్వహిస్తారు. కాగా మొదటి విడుతలో భాగంగా 212 జడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ స్థానాలకు మే 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 26న రెండవవిడత నోటిఫికేషన్ వస్తుంది. మే10న పోలింగ్ వుంటుంది. ఏప్రిల్ 30న మూడవవిడత నోటిఫికేషన్ విడుదల అవుతుంది. మే14న పోలింగ్ నిర్వహిస్తారు. మూడో విడుతలో భాగంగా 124 జడ్పీటీసీలు, 1343 ఎంపీటీసీ స్థానాలకు మే 14న పోలింగ్‌ జరగనుంది. మొత్తం మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేస్తారు.  

Similar News