మీరు చేసిన ఇద్దరు కేంద్ర మంత్రుల్లో బీసీలు ఉన్నారా ?

Update: 2019-01-28 06:25 GMT

ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోయేందుకు బీసీలు సిద్ధంగా లేరని వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నాలుగున్నరేళ్లలో బీసీలకు ఒక్క మేలు చేయని చంద్రబాబు ఎన్నికల వేళ హామీలతో తాయిలాలు ప్రకటిస్తున్నారంటూ ఆరోపించారు. బీసీలకు మేలు చేసి ఉంటే ఇప్పుడు ఈ హామీలు ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పగలరా ? అంటూ నిలదీశారు. బీసీల మీద ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఎందుకు కల్పించలేదంటూ ధర్మాన ప్రశ్నించారు. వైఎస్ఆర్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ధీటుగా స్పందించింది. వైఎస్ఆర్ పాలనలోనే బీసీ విద్యార్ధులకు పూర్తి స్ధాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ దక్కిందన్నారు. బీసీ మంత్రలుగా ఉన్న తాము ఏమి చెప్పినా వైఎస్ఆర్ విని ఆచరించారని ఆయన అన్నారు. బీసీలు న్యాయమూర్తులుగా కాకుండా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదైతే .. బీసీలను చేరదీసి అండగా నిలిచిన వ్యక్తిత్వం వైఎస్‌ఆర్‌దన్నారు.  

Similar News