వైఎస్ విజయమ్మ సిఫార్సు.. ఆయనకు మంత్రి పదవి కన్ఫామా?

Update: 2019-06-01 02:19 GMT

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో మంత్రుల పదవులపై చర్చలు జరుగుతునే ఉన్నాయి. ఈ నేఫథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మంత్రి పదవి విషయంలో మరో బలమైన సిఫార్సు లభించినట్టుగా తెలుస్తోంది. అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ నుంచి కావడం గమనార్హం! ప్రస్తుతం పార్టీలో గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కొనసాగుతొంది.

ఇది వరకూ కూడా తన తల్లి విజయమ్మ సిఫారసు మీద పలువురికి ఎమ్మెల్యే టికెట్లను కేటాయించారు జగన్. ఈ క్రమంలో మంత్రి పదవి విషయంలో కూడా తన తల్లి ఒక సిఫార్సు చేసినట్టుగా సమాచారం. అది జక్కంపూడి రాజాకు మంత్రి పదవి విషయంలో అనే జోరుగా ప్రచారం సాగుతోంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు జగన్ వెంట నడిచిన వారిలో జక్కంపూడి రామ్మోహన్ రావు ఒకరు. ఆ తర్వాత కొంతకాలానికే ఆయన మరణించారు. కాగా ఆయన భార్య కొడుకు తర్వాత జగన్ మోహన్ వెంటే ఉన్నారు. తొమ్మిది సంవత్సరాలుగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రతీ ఉద్యమం, ప్రతీ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా ఆయన వెన్నంటే ఉన్నారు. ఇటీవల ఏపీ సార్వత్రి ఎన్నికల్లో రాజాకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు జగన్. తాజా ముగిసిన ఎన్నికల్లో రాజానగరం నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా జక్కంపూడి రాజా నెగ్గారు. ఇప్పుడు మంత్రి పదవి విషయంలో ఆశావహుడిగా ఉన్నారు రాజా. మొత్తానికి వైఎస్ విజయమ్మ సిఫార్సుతో రాజాకు మంత్రి పదవి అవకాశాలు మరింత బలం చేకురిందని, దాదాపు రాజాకు మంత్రిపదవి ఖాయమనే ఓ రేంజ్‌ లో ప్రచారం సాగుతోంది. మరీ జక్కంపూడి రాజాకు మంత్రి వరిస్తోందో లేదో అనేది వేచిచూడిల్సిందే.

Similar News