విజయమ్మ, షర్మిల పర్యటన ఇలా..

Update: 2019-03-31 05:07 GMT

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల ఆదివారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు.ఉ.10:55 నిమిషాలకు గుంటూరు జిల్లా పెదకూరపాడులో ప్రచార సభ, మ.1:50 నిమిషాలకు రొంపిచెర్లలో మహిళలతో షర్మిల ముఖాముఖి సా.4:50 నిమిషాలకు ప్రకాశం జిల్లా సంతమాగులూరులో షర్మిల ప్రచార సభ, రా.7:50 నిమిషాలకు చీరాలలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఆముదాలవలస నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో విజయమ్మ పాల్గొంటారు.  

Similar News