తిరుమలకు జగన్‌ పాదయాత్ర

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. విజయనగరం నుంచీ రైల్లో బయల్దేరిన జగన్‌ మరికాసేపట్లో రేణిగుంట చేరుకోనున్నారు.

Update: 2019-01-10 03:45 GMT
YS Jagan

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. విజయనగరం నుంచీ రైల్లో బయల్దేరిన జగన్‌ మరికాసేపట్లో రేణిగుంట చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11 గంటలకల్లా తిరుపతి పద్మావతీ అతిధి గృహం చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బయల్దేరి కాలినడకన తిరుమలకు బయల్దేరుతారు.

జగన్‌ సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాలినడక భక్తులు వెళ్లే దివ్య దర్శనం క్యూలైన్‌ ద్వారా స్వామి వారి దర్శనానికి వెళతారు. సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో కొండపైకి చేరుకోనున్న జగన్‌... పద్మావతీ అతిధి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం శ్రీవారి దర్శనానికి వెళతారు. అనంతరం శారదా మఠానికి వెళ్ళి బస చేస్తారు. గతంలో తిరుమలకు వచ్చినపుడు కూడా శారదా మఠంలోనే జగన్‌ బస చేశారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి శుక్రవారం తెల్లవారు జామున 6 గంటలకు తిరుమల నుంచీ పులివెందులకు బయల్దేరుతారు.

Similar News