పవన్‌కి అందులో భాగం ఉంది.. టీడీపీ ఓటుకు మూడు వేలు ఇచ్చినా..: జగన్

Update: 2019-04-03 10:19 GMT

ఏపీ ఎన్నికల్లో సీఎం సీటే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఆయా పార్టీ అధినేతలు. ఇప్పటికే పొలింగ్ దగ్గరపడుటుండంతో ప్రచారంలో దూసుకపొతున్నారు. కాగా ఒకరిపై మరోకరు విమర్శల వర్సం కురిపించుకున్నారు. కాగా తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబులపై జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగంలో జనసేన అధినేత పవన్‌కు కూడా భాగం ఉందని జగన్ ఆరోపించారు. గత 2014 ఎన్నికల్లో టీపీపి గెలుపే లక్ష్యంగా ప్రచారం చేశారని, నాలుగున్నరేళ్లపాటు ఆయన టీడీపీతోనే ఉన్నా పవన్ కళ్యాణ్ కేవలం ఎన్నికలకు ఆరునెలలముందు టీడీపీకి దూరమయ్యారన్నారు.

నారా చంద్రబాబు అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించి నాలుగున్నరేళ్లపాటు బాబు ప్రభుత్వంతో ఉన్న పవన్‌కు అధికార దుర్వినియోగంలోనూ భాగం ఉంటుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ ఓటుకు మూడు వేలు ఇచ్చినా ప్రజలు మాత్రం బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు జగన్. హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించనని చంద్రబాబు వాదనలో వాస్తవం లేదన్న జగన్ బాబు హయాంలో కంటే వైఎస్ పాలనలోనే నగరం ఎక్కువగా అభివృద్ధి చెందిదన్నారు. బాబు హైదరాబాద్‌ను నిర్మించలేదు ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిని నిర్మించడం లేదని జగన్ స్పష్టం చేశారు.

Similar News