అధికారులపై సీఎం జగన్ సీరియస్‌

Update: 2019-06-06 06:45 GMT

వ్యవసాయ రంగంపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల చలామణిపై సీరియస్‌ అయ్యారు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అక్రమాలు జరిగితే జైలుకు పంపడానికి కూడా వెనుకడుగు వేయొద్దని ఆదేశించారు. అయితే విత్తనచట్టం తీసుకురావాలని అధికారులు సూచించగా అవసరమైతే అసెంబ్లీలో చర్చించి విత్తన చట్టం తీసుకొద్దామని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు అజయ్‌ కల్లం, ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్‌, వ్యవసాయశాఖ సలహాదారు విజయ్‌కుమార్‌, ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌, వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డి హాజరయ్యారు.

Tags:    

Similar News