యువకుల ర్యాష్ డ్రైవింగ్.. ప్రశ్నిస్తే .. పోలీసు వారి తాలూకా అంటూ బెదిరింపు

Update: 2019-05-13 07:56 GMT

బైక్ దొరికిందంటే చాలు యూత్ హద్దు అదుపు లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. ఇక కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు పేరున్న వాళ్లుంటే.. ఇక వారిని ఆపలేం. ప్రశ్నించిన వాళ్లని బెదిరిస్తారు కూడా. ఇక పోలీసోళ్ల పిల్లలు అయితే ఎలా రియాక్ట్ అవుతారో మీరే చూడండి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో గాలి వేగంతో పోటీపడుతూ ఒక బైక్‌పై ముగ్గురు కురాళ్లు దూసుకెళ్లడం కనిపించింది. ఆ బైక్‌ను ఆపి చూస్తే.. అది కాస్తా పోలీస్ వాహనం. వీడియో తీస్తూ వివరాల కోసం ఆరా తీస్తే వివరాలు చెప్పేది పోయి మేం పోలీసు బిడ్డలమని కొట్టడానికి మీదకొచ్చారు. యువత ర్యాష్ డ్రైవింగ్‌పై అవగాహన కల్పించే పోలీసులు ఇలాంటి ఘటనల్లో ఎలా వ్యవహరిస్తో చూడాలి.

Full View

Similar News