వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల వాయిదా..

Update: 2019-03-16 11:14 GMT

వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా వాయిదా పడింది. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం తొలి జాబితాను విడుదల చేస్తారని అనుకున్నారు కాని కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు. రేపు ఇడుపులపాయలో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. తరువాత ఇడుపులపాయ నుంచి జగన్ విశాఖకు వెళ్లనున్నారు. నెల్లిమర్ల, నర్సీపట్నం, పి.గన్నవరంలో ఎన్నికల వైయస్ జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గోంటారు. తన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై రాజ్ భవన్‌లో గవర్నర్‌ను జగన్ కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ తమ బాబాయ్ కేసు విషయంలో సీబీఐ విచారణకి ఆదేశించాలని జగన్ గవర్నర్ ని కోరారు. సీబీఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వడం లేదని జగన్ ప్రశ్నించారు. ఇంట్లో ఒక్క డే ఉన్నాడని తెలుసుకోని పకడ్బందీగా హత్య చేశారని జగన్ ఆరోపించారు. డీజీపీ, అడిషనల్ డీజీని ఎన్నికల విధుల నుండి తప్పించాలని, సీబీఐ విచారణకు ఆదేశించకపోతే కోర్టుకు వెళ్తామని జగన్ హెచ్చరించారు.

Similar News