వైసీపీ అధికారంలోకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి ?

Update: 2019-05-17 05:44 GMT

కడప జిల్లా వైసీపీకి కంచుకోట .. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీదే హవా .. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచినా వైసీపీ అభ్యర్దులు టిడిపి పార్టీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అన్న చర్చ జోరుగా సాగుతుందట . 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై గెలిచినా జమ్మలమడుగు ఎమెల్యే ఆదినారాయణరెడ్డి , బద్వేలు ఎమెల్యే జయరాములు అప్పటి రాజకీయ పరిస్థితుల అనుగుణంగా టిడిపిలో చేరారు .ఇందులో ఆదినారాయణరెడ్డి మంత్రి కూడా అయ్యారు .

ఆదినారాయణరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కింది . అ తర్వాత విళ్ళీద్దరి మధ్య సయోధ్య కుదరడంతో జమ్మలమడుగు ఎమెల్యేగా రామసుబ్బారెడ్డి పోటి చేయగా కడప ఎంపీగా ఆదినారాయణరెడ్డి పోటికి దిగారు . కడప ఎంపీ సీటు ఎలాగైనా దక్కించుకోవాలనే కోణంలో ఆదినారాయణరెడ్డిని పొటిలోకి దించింది టిడిపి.. అయితే విల్లిద్దరు కలిసి పోటి చేయడం టిడిపికి వర్కౌట్ అయ్యిందా లేదా అన్నది చర్చగా మారింది ..

అయితే తాజాగా సర్వే రిపోర్ట్స్ ఆధారంగా వర్కౌట్ అవలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు . ఇక బద్వేలు ఎమెల్యే జయరాములు పరిస్థితి ఇలాగే ఉందని తెలుస్తుంది. బద్వేలు నుండి టికెట్ ఇచ్చి గెలిపించుకున్న వైసీపీకి అయన హ్యాండ్ ఇచ్చి టిడిపిలో చేరినందుకు ఈ సారి ఆయనకు టికెట్ దక్కలేదు . దీనితో అయన బీజేపిలో చేరారు . అయతే ఈ ఎనికల్లో అయన గెలవడం కష్టమేనని తెలుస్తుంది . అయితే వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ వీళ్ళు వైసీపీ గూటికి చేరుతారని వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తుంది..  

Similar News