రోజాకు మద్దతుగా విజయశాంతి..ట్విట్టర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..

Update: 2019-06-11 05:48 GMT

ఇటివలే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నూతన మంత్రి మండలి కొలువుదీరింది. మంత్రివర్గ కూర్పులో సీఎం జగన్‌ ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్య సమతూకం పాటించారు. ఒకేసారి 25మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్న ఆయన పార్టీకి మద్దతుగా నిలిచిన వర్గాలకు కేబినెట్ లో ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా కొత్తగా మంత్రులుగా ఎన్నికైన 25మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ నరసింహన్‌ పదవీ స్వీకార ప్రమాణం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న మార్పులపై సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీలో ఉండే చాలామంది నాయకులకు మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి మొండిచేయి చూపించారు.

దీంతో తమకు మంత్రి పదవి ఖాయమని అనుకున్న ఆశావహులంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అందులో ప్రముఖంగా ఎప్పటి నుంచో జోరుగా వినిపించే పేరు నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో సినీ నటి రోజాను కూడ తీసుకుని ఉంటే బాగుండేదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. దీనిపై తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా ట్వీట్లు పెట్టారు. సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని, వారికి కూడా తగిన గుర్తింపు ఇస్తే చాలా బాగుంటుందని నేను చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో నైనా సీఎం వైఎస్ జగన్ గారు రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని రాములమ్మ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.



 


Tags:    

Similar News