వనస్థలిపురంలో భారీ దోపిడీ..

Update: 2019-05-07 08:52 GMT

హైదరాబాద్‌ వనస్థలీపురంలో పట్టపగలు దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎం మిషిన్లలో డబ్బులు నింపే వ్యాన్‌ నుంచి 58 లక్షలకు పైగా నగదును దోచుకెళ్లారు. డబ్బులు నింపే సిబ్బందిని మాటల్లో పెట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు.

పనామా సెంటర్‌లో యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వ్యాన్‌ చేరుకుంది. అంతలోనే అక్కడికి చేరుకున్న దుండగులు సిబ్బందిని మాటల్లో దించారు. అటెన్షన్‌ డైవర్షన్‌తో నగదు పెట్టేను అంతకుముందే అక్కడికి చేరుకున్న ఆటోలోకి ఎక్కించి ఉడాయించారు.

సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన రాజధానిలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 58 లక్షలకు పైగా నగదు చోరీ అయినట్లు గుర్తించినట్లు ఎల్‌బీ నగర్‌ డీసీపీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. చోరీ జరిగిన విధానంపై విచారణ జరుగుతుందని అటెన్షన్‌ డైవర్షన్‌ గ్యాంగ్‌లో ఐదుగురు సభ్యులున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు.  

Similar News