ఏపిలో కూడా రైతుబంధు పథకాన్ని నకలు కొట్టారు: కేటీఆర్

Update: 2019-04-07 09:48 GMT

సీఎం కేసీఆర్‌ రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని పేరు మార్చి ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్‌ యోజన అమలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మల్కాజ్ గిరి టీఆర్ఎంపీ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా కొంపల్లిలో నిర్వహించిన వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్..తెలంగాణ నమూనాను యావత్ దేశం గమనిస్తుందన్నారు. రాష్ర్ట పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు మార్గాన్ని మరింత విస్తరిస్తామని.. హైదరాబాద్‌లోని చెరువులన్నీ సుందరీకరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతుబంధు పథకాన్ని నకలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ పేరిట పథకం తీసుకొచ్చారు. రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలకు 1300 టీఎంసీలు కావాలి. 1300 టీఎంసీలు సమకూరితే 1.25 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చు అన్నారు.

Similar News