ఢిల్లీని యాచించడం కాదు.. శాసించాలి : కేటీఆర్

ఎన్నికల్లో విజయం సాధించడం తెలంగాణ ప్రజలకు అంకితమని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అద్భుతంగా పని చేశారన్నారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని ఆమోదించి ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.

Update: 2018-12-30 10:39 GMT

ఎన్నికల్లో విజయం సాధించడం తెలంగాణ ప్రజలకు అంకితమని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అద్భుతంగా పని చేశారన్నారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని ఆమోదించి ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. గెలుపుతో మనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 16పార్లమెంట్ స్థానాలను ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే బలం ఉంటే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చని కేటీఆర్ వివరించారు. 16పార్లమెంట్ సీట్లు గెలిస్తే రైతులకు సంబంధించిన సమస్యలను దేశ ఎజెండాలో పెట్టవచ్చన్నారు. మన తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక దిక్సూచిలా అవతరిస్తుంది. ఢిల్లీ పెద్దలను యాచిండం కాదు, శాసించాలి ప్రొఫెసర్ జయశంకర్ అనే వారని కేటీఆర్ గుర్తుచేశారు. 

Similar News