మహిళా రిజర్వేషన్ల గురించి ఎందుకు పట్టించుకోరు : బండ ప్రకాష్
కోటా బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్ తెలిపారు.
కోటా బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్ తెలిపారు. ఇప్పటి వరకు సమాజికపరమైన రిజర్వేషన్లు చూశామనీ ఇప్పుడు ఆర్థికపరమైన రిజర్వేషన్లు అంటున్నారని కోటా బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా బండ ప్రకాష్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన ముస్లిం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఎందుకు పెండింగ్ లో పెట్టిందని బండ ప్రకాష్ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు గురించి మోడీ సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. తెలంగాణ పెండింగ్ బిల్లులను అప్రూవ్ చేయాలని రాజ్యసభ వేదికగా కేంద్రాన్ని కోరారు.