అందుకే టీఆర్ఎస్‌లో చేరాం : ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా

Update: 2019-03-04 12:42 GMT

టీ కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు,రేగా కాంతరావు. దళితులు, ఆదివాసులను కాంగ్రెస్ పార్టీలో చిన్నచూపు చూస్తున్నారని ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆరోపించారు. తమ ఇళ్ల ముందు ధర్నాలు చేయాలని కాంగ్రెస్ నేతలు పిలుపు ఇచ్చారని, దమ్ముంటే చేసి చూపించాలని సవాల్ చేశారు. ఆదివాసుల సమస్యలు పరిష్కారిస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు టీఆర్ఎస్‌ చేరాలని నిర్ణయించుకున్నానంటున్న రేగా కాంతారావు, ఆత్రం సక్కు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 16 మంది ఎమ్మెల్యేల్లో వారిలోనే నాలుగు గ్రూపులు ఉన్నాయన్ని ఆత్రం సక్కు ఆరోపించారు. 

Similar News