పంచాయతీ తొలిదశలో భారీగా నామినేషన్లు

తెలంగాణలో పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 4,479 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవికి 27,940 మంది నామినేషన్లు వేశారు.

Update: 2019-01-10 12:26 GMT

తెలంగాణలో పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 4,479 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవికి 27,940 మంది నామినేషన్లు వేశారు. 39,822 వార్డులకు గాను 97వేల 690 మంది నామినేషన్లు వేశారు. ఈనెల 13న నామినేషన్లు విత్‌ డ్రా ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల సంఘం అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఈ నెల 21న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పోలింగ్ జరుగుతుంది. అదేరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుపనుంది ఈసీ. 

Similar News